బీసీలు బ్యాక్‌వార్డు క్లాసులు కాదు. బ్యాక్‌బోన్‌ క్లాసులు: జగన్

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (07:50 IST)
‘బీసీ అంటే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ కాదు. దేశ చరిత్ర, సంస్కతిని కొన్ని వేల సంవత్సరాలు వారు నిలబెట్టారు. బీసీలు జాతికి వెన్నెముక కులాలు. కట్టుకునే బట్ట.. తినే తిండి.. అన్నం తినే కంచం.. మంచినీరు తాగే గ్లాస్‌.. నివసించే ఇల్లు.. ఇలా మన జీవితంలో ప్రతి చోటా బీసీలదే పాత్ర.

భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం.. అగ్గిపెట్టెలో పట్టే చీర.. మంగళ సన్నాయి.. ఏది చూసినా మన బీసీల గొప్పతనమే. అందుకే వారందరికి వందనం’ అంటూ నాడు ఏలూరు బీసీ గర్జనలో ప్రతి ఒక్కరి గుండె తలుపు తట్టిన సీఎం వైయస్‌ జగన్, దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
 
ప్రత్యేక కార్పొరేషన్లు:
‘బీసీలు అంటే వెనుకబడిన వర్గాల వారు కాదు. వెన్నెముక లాంటి వర్గాలు’ అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తున్న సీఎం వైయస్‌ జగన్, మొత్తం 139 బీసీ కులాల వారి కోసం ఒకేసారి 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
 
ఛైర్మన్లు. డైరెక్టర్లు:
అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్‌లో 13 మంది డైరెక్టర్లను నియమిస్తున్నారు. 56 కార్పొరేషన్లకు ఈనెల 18వ తేదీ (ఆదివారం)న ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఆ పోస్టుల్లో సగానికి పైగా వారికి కేటాయించారు. 
 
బీసీలు– వైయస్‌ జగన్‌ ప్రభుత్వం:
ఇంకా ఈ ప్రభుత్వం బీసీలకు ఏమేం చేసిందంటే..:
– మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట
– ఉప ముఖ్యమంత్రి పదవితో సహా, ఏడు మంత్రి పదవులు
– శాసనసభ స్పీకర్‌ పదవి
– బీసీల స్థితిగతుల అ«ధ్యయనం. వారి సమస్యల  పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు
– వివిధ పథకాల ద్వారా గత 16 నెలల్లో మొత్తం 2,71,37,253 మంది బీసీలకు దాదాపు రూ.33,500 కోట్ల మేర ప్రయోజనం.
 
కొత్తగా ఏర్పాటు చేస్తున్న 56 బీసీ కార్పొరేషన్ల జాబితా: 
1). ఎపి ఈడిగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
2). ఎపి వాషర్‌మెన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
3). ఎపి నాయూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
4). ఎపి వడ్డెర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
5). ఎపి సగర (ఉప్పర) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
6). ఎపి వాల్మీకి/బోయ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
7). ఎపి కష్ణ బలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
8). ఎపి భట్రాజు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
9). ఎపి కుమ్మరి/శాలివాహన వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
10). ఎపి స్టేట్‌ విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
11). ఎపి మేదరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
12). ఎపి శెట్టి బలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
13). ఎపి మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
14). ఎపి యాదవ (గొల్ల) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
15). ఎపి తూర్పు కాపు, గాజుల కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
16). ఎపి కొప్పుల వెలమ/పోలినాటి వెలమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
17). ఎపి కురుబ/ కురుమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
18). ఎపి వన్యకుల క్షత్రియ (వన్నెరెడ్డి/ వన్నెకాపు/ పల్లికాపు/ పల్లిరెడ్డి) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
19). ఎపి కళింగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
20). ఎపి గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
21). ఎపి వీవర్స్‌ (పద్మశాలి/సాలి/సాలివన్‌) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
22). ఎపి ఫిషర్‌మెన్‌ (పల్లి/వాడబలిజ/జాలరి/గంగావర్‌/గంగ పుత్ర/గూండ్ల/నెయ్యాల/పట్టపు) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
23). ఎపి గాండ్ల/తెలుకుల/దేవటి లాకులవెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
24). ఎపి ముదిరాజ్‌/ముత్రాసి/తెనుగోళ్ళ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
25). ఎపి నగరాలు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
26). ఎపి స్టేట్‌ షేక్‌ / షేక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
27). ఎపి స్టేట్‌ ముస్లీం సంచార జాతుల వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
28). ఎపి స్టేట్‌ గౌడ వెల్ఫేర్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
29). ఎపి స్టేట్‌ పాల ఎకరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
30). ఎపి స్టేట్‌ కళింగ కోమటి/కళింగ వైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
31). ఎపి స్టేట్‌ రెడ్డిక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
32). ఎపి స్టేట్‌ జంగం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
33). ఎపి స్టేట్‌ దేవాంగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
34). ఎపి స్టేట్‌ తొగట తొగటి/తొగటి సాలి/ తొగట వీర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
35). ఎపి స్టేట్‌ కుర్ని/కరికాల భక్తులు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
36). ఎపి స్టేట్‌ వడ్డెలు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
37). ఎపి స్టేట్‌ ఆరె కటిక / కటిక / ఆరె – సూర్యవంశి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
38). ఎపిస్టేట్‌ పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
39). ఎపి స్టేట్‌ కుంచితి వక్కలిగ, వక్కలిగర, కుంచితిగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
40). ఎపి స్టేట్‌ సూర్యబలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
41). ఎపి స్టేట్‌ ముదలియార్, అగముడియన్, అగముడియార్, అగముడివెల్లల, అగముడి ముదలియార్‌ (తుళువ వెల్లవాస్‌ తో కలిపి) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
42). ఎపి స్టేట్‌ చాత్తాడ శ్రీవైష్ణవ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
43). ఎపి స్టేట్‌ శిష్టకరణం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
44). ఎపి స్టేట్‌ వీరశైవ లింగాయత్, లింగబలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
45). ఎపి స్టేట్‌ కూరాకుల/పొందర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
46). ఎపి స్టేట్‌ ఆర్యక్షత్రియ/బొందిలి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
47). ఎపి స్టేట్‌ అయ్యారక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
48). ఎపి స్టేట్‌ అతిరస/కుర్మి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
49). ఎపి స్టేట్‌ పోలినాటి వెలమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
50). ఎపి స్టేట్‌ దాసరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
51).ఎపి స్టేట్‌ యాత వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
52). ఎపి స్టేట్‌ శ్రీశయన/శెగిడి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
53). ఎపి స్టేట్‌ నూర్‌బాషా వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
54). ఎపి అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
55). ఎపి బెస్త వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
56). ఎపి నాగవంశం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు