విశాఖ రైల్వే ఆసుపత్రిలో మెడ్‌ రోబో సేవలు

గురువారం, 5 నవంబరు 2020 (07:28 IST)
విశాఖ రైల్వే ఆసుపత్రిలో కోవిడ్‌ -19 రోగులకు మెడ్‌ రోబో సేవలు అందిస్తోంది. కోవిడ్‌ రోగులకు సేవ చేయడానికి డీజిల్‌ లోకో షెడ్‌ రోబోను మరింత మెరుగుపరిచినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ఈ రోబోట్‌ సహాయంతో వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది నోవెల్‌ కరోనా వైరస్‌ సంక్రమణను దూరంగా ఉండగలుగుతారని, మెడ్‌ రోబో ఒక ప్రత్యేకమైన మొబైల్‌ అనువర్తనం ద్వారా నిర్వహించబడుతుందని వివరించారు.

దీనికి వైఫై సౌకర్యం ఉందని, ఇంతకుముందు అందించిన ప్రాథమిక లక్షణాలతో పాటు, డిఎల్‌ఎస్‌ బృందం మెడ్‌ రోబోను కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేశారని, రోగి, డాక్టర్‌, నర్సింగ్‌ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ కోసం వైఫై కెమెరాతో ఇరువైపులా మాట్లాడే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు