17 నుంచి తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

సోమవారం, 12 అక్టోబరు 2020 (06:44 IST)
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

26న ఆల‌యంలో గజ వాహనసేవ చేప‌డ‌తారు. ఉత్స‌వాల కార‌ణంగా 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, ఈ నెల 23న జ‌రిగే ల‌క్ష్మీపూజ సేవ‌లు రద్ద‌య్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు