మంగళగిరిలో పచారి షాపులు మినహా ఏ షాపులకూ అనుమతి లేదు

మంగళవారం, 19 మే 2020 (06:04 IST)
లాక్ డౌన్ నిబంధనలు ఏమైనా సడలిస్తున్నారా మంగళగిరి లో షాపులు తెరిచే అవకాశం ఉందా అన్న సందేహాలు ప్రస్తుతం వ్యాపారస్థుల్లో కలుగుతున్నాయి.

వీటిపై స్పందించిన కోవిడ్ 19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పచారి షాపులు,కూరగాయలు,పండ్లు విక్రయ కేంద్రాలు మినహా ఏ విధమైన దుకాణాలూ తెరిచేందుకు అనుమతి లేదని అన్నారు.

మంగళగిరి పట్టణంలో 3 వ కేసు నమోదైన తరువాత 28 రోజుల వరకూ రెడ్ జోన్ నిబంధనలు అమలవుతాయి. ప్రక్క నే ఉన్న తాడేపల్లిలో మొత్తం 11 కేసులు నమోదు కావటంతో కంటైన్మెంట్,బఫర్ జోన్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు రామ్ ప్రసాద్ తెలిపారు.

అవసరమైతే మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల మధ్య రాక పోకల్ని నిషేధిస్తామని స్వష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు