వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలి: కోవిడ్-19 టాస్క్ ఫోర్స్

గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:11 IST)
వయోవృద్ధులు ఎట్టిపరిస్థితులల్లో ఇళ్లు దాటి బయటకు రాకూడదని, బయటి వ్యక్తులు ఇంటికి వచ్చి కలిసేందుకు కూడా అనుమతించరాదని, తప్పని సరి పరిస్థితుల్లో బయటవారిని కలవాల్సి వస్తే ఒక మీటర్ భౌతిక దూరం పాటించాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.

సాధారణ వ్యక్తులతో పోల్చితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాదపడేవారికి కరోనా వైరస్ వల్ల ఎక్కువ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున వృద్దులు,వారి సంరక్షకులు ప్రభుత్వం ఇ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత వ్యాధులతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ, లివర్, మధుమేహం, క్యాన్సర్, పార్కిన్ సన్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని స్తున్న సూచనలు పాటించడం ద్వారా వ్యాధి సంక్రమించకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆయన కోరారు.  
 
సబ్బు నీటితో ఎప్పటికప్పుడు చేతులు, ముఖం కడుగుతుండాలని, తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలన్నారు. టిష్యూ పేపర్ కాని రుమాలును కాని అడ్డు పెట్టుకుంటే  వెంటనే వాటిని  పారేయడం లేదా ఉతకడం, కడగడం చేయాలన్నారు.

ఇంట్లో వండిన వేడి వేడి భోజనాన్ని తీసుకోవాలని అందులో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండేలా చూడాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్ల రసాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ వ్యాయామం, ధ్యానం తో పాటు వైద్యులు సూచించిన రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు.

అందుబాటులో లేని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫోన్, వీడియో కాల్ లో మాడ్లుతూ ఉండొచ్చు అన్నారు. అత్యవసరంకాని శస్త్ర, చికిత్సలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం అన్నారు. ఇంట్లో వారు తాకిన ప్రాంతాలను, వస్తువులను క్రమం తప్పకుండా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేయిస్తూ ఉండాలన్నారు. వృద్ధులకు జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించి వైద్య సలహాలు, సూచనలు పాటించాలన్నారు.


వృద్ధులకు సహాయంగా ఉండేవారు పాటించాల్సిన విషయాలు పరిశీలిస్తే వృద్ధులకు సహాయం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వృద్దుల దగ్గర ఉన్నప్పుడు మాస్కును లేదా వస్త్రాన్ని రక్షణగా ఉపయోగించాలన్నారు. తరచుగా ఉపయోగించబడే వాకింగ్ స్టిక్ (చేతికర్ర), వాకర్, వీల్-కుర్చీ, బెడ్ పాన్ ఉపరితలాలను శుభ్రపరడం చేయాలన్నారు.

వృద్ధులు చేతులు కడుక్కునే సమయంలో వారికి సహాయం చేయడం, సరైన ఆహారం మరియు నీరు తీసుకునెలా చూసుకోవడం, తరచూ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేలా వాకబు చేయడం చేయాలన్నారు. 

సీనియర్ సిటిజన్ల మానసిక ఆరోగ్యం పై చేయవలసిన వాటిలో ముఖ్యంగా వారిని ప్రశాంత వాతావరణంలో ఉండేలా చూడటం, సీనియర్ సిటిజన్స్ మానసిక ఆరోగ్యం పై ఇంట్లో బంధువులకు సమాచారం ఇవ్వడం, భౌతిక దూరాన్ని పాటించేలా ఇరుగు పొరుగు వారికి తెలియజేయటంతో పాటు ఒంటరితనం లేదా విసుగు చెందకుండా ఉండేందుకు పొగాకు, ఆల్కహాల్ మరియు ఇతర మందులను ఉపయోగించరాదన్నారు.

జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవడం చేయకూడదని, కళ్ళు, ముక్కు, ముఖం లేదా నాలుకను తాకకూడదని, కరోనా బారినపడ్డవారు లేదా అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరకు వెళ్లకూడదన్నారు. స్నేహితులు, బంధువులతో కరచలనాలు, ఆలింగనాలు చేయకూడదన్నారు.

సాధ్యమైనంత వరకు టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా వైద్యులను సంప్రదించాలని, రద్దీ ప్రదేశాలకు వెళ్లరాదని, ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు