పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు.. నీళ్లు ఎక్కువగా తాగాలి!

శనివారం, 20 డిశెంబరు 2014 (13:40 IST)
మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. బిడ్డకు తల్లిపాలు ఇచ్చే మహిళ బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్ గ్రెయిన్స్) పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లితినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటారు. 
 
పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువ నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటారు. అయితే ఇది అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకు దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. 
 
తల్లిపాలతో బిడ్డకు మేలు జరగాలంటే.. బీన్స్, పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి