మొన్న ఈట్ పరోటా.. నేడు పాప్ కార్న్.. జీఎస్టీ స్లాబ్‌లోకి వచ్చేశాయిగా!

శుక్రవారం, 26 జూన్ 2020 (12:03 IST)
టైమ్ పాస్ కోసం మనం తీసుకునే స్నాక్స్‌లో పాప్‌కార్నే ముందుంటుంది. అయితే ప్రస్తుతం పాప్ కార్న్ అయినా నములుదామని కొన్నారనుకోండి.. జీఎస్టీ తప్పదు. రెడీ ఈట్ పాప్ కార్న్ మార్కెట్‌లో లభ్యం అవుతున్న సంగతి తెలిసిందే. వేడి వేడి పాప్ కార్న్ అలా ఒక్కొక్కటిగా తింటూ వుంటే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలో పాప్ కార్న్ రేట్లు పెరుగుతున్నాయని తెలిసి జనం షాకయ్యారు. ఇందుకు కారణంగా పాప్ కార్న్ రేట్లు జీఎస్టీలో చేరడమే.  
 
మొన్నటి వరకు 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్న పాప్ కార్న్ ఇప్పుడు 18 శాతం రేట్ల శ్లాబ్ లోకి చేరిపోయింది. రెడీ టూ ఈట్ పాప్ కార్న్ పై 18 శాతం జీఎస్టీ విధిస్తామని గుజరాత్ జీఎస్టీ అడ్వాన్స్ రూలింగ్స్ అథార్టీ (ఏఏఆర్) స్పష్టం చేసింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్‌ నిల్వ ఆహార పదార్థాలన్నీ 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని ఏఏఆర్ స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం రెడీ టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు