భారతదేశంలో లాండ్రీ పునర్నిర్వచించబడింది: భారతదేశంలో ఏరియల్‌ పాడ్స్‌ ఆవిష్కరణ

బుధవారం, 11 నవంబరు 2020 (16:45 IST)
పీ అండ్‌ జీకు చెందిన సుప్రసిద్ధ డిటర్జెంట్‌ బ్రాండ్‌లలో ఒకటైన ఏరియల్‌ దేశంలో ఆవిష్కరణలకు తోడ్పాటునందిస్తుంది. లాండ్రీ విభాగంలో నూతన విభాగాన్ని సృష్టిస్తూ, విప్లవాత్మక లాండ్రీ ఉత్పత్తిని ఒక్కసారి వినియోగించతగిన టాబ్లెట్స్- పాడ్స్‌గా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో, లాండ్రీ పాడ్స్‌ ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. లాండ్రీకి అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా దీనిని భావిస్తుంటారు. ఏరియల్‌ 3 ఇన్‌ 1 పాడ్స్‌ను భారతదేశంలో ఇటీవలనే ఆవిష్కరించారు. ప్రీ డోస్డ్‌ వాషింగ్‌ క్యాప్సూల్స్‌గా ఇవి ఉంటాయి. ఏరియల్‌ 3 ఇన్‌ 1 పాడ్స్‌ మూడు రకాల శుభ్రత ప్రయోజనాలు- శుభ్రత, మరకలు తొలగించడం మరియు ప్రకాశాన్ని అందిస్తుంది.
 
శక్తివంతమైన అంశాలు చిన్న ప్యాకేజీలలో వస్తాయి. ఏరియల్‌ పాడ్స్‌ను సృజనాత్మకంగా రూపొందించారు. నీటిలో కరిగటేటువంటి ఫిల్మ్‌, మూడుచాంబర్స్‌లో లిక్విడ్‌ డిటర్జెంట్‌ను కలిగి ఉంది. ఈ పాడ్‌ను వాషింగ్‌ మెషీన్‌లో ఉంచగానే, ఈ ఫిల్మ్‌ కరుగుతుంది. ఏరియల్‌ మ్యాటిక్‌ 3 ఇన్‌ 1పాడ్స్‌ అటు టాప్‌ మరియు ఫ్రంట్‌ లోడ్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లకు అనుకూలంగా ఉంటుంది.
 
ఏరియల్‌ పాడ్స్‌ ఆవిష్కరణ గురించి శరత్‌ వర్మ, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, పీ అండ్‌ జీ ఇండియా మరియు వైస్‌ ప్రెసిడెంట్‌, ఫ్యాబ్రిక్‌ కేర్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా మా తాజా లాండ్రీ ఆవిష్కరణ ఏరియల్‌ పాడ్‌. సంవత్సరాల తరబడి  పరిశోధన తరువాత పీ అండ్‌ జీ దీనిని అభివృద్ధి చేసింది. ఇది లాండ్రీ కష్టాల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా సౌకర్యమూ అందిస్తుంది. ఒకసారి దీనిని ప్రయత్నిస్తే, మీరు ఎన్నటికీ వెనక్కీ వెళ్లరు’’ అని అన్నారు.
 
ఏరియల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, సెలబ్రేటెడ్‌ చీఫ్‌ సంజీవ్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘ఏరియల్‌ పాడ్స్‌ను భారతదేశంలో ఆవిష్కరించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. కుకింగ్‌ ఓ అద్భుత అనుభవం అయితే, ఏరియల్‌ లాండ్రీ కూడా వినూత్నమైన అనుభవాలను అందిస్తుంది..’’అని అన్నారు. ఏరియల్‌ పాడ్స్‌, నవంబర్‌ 1 నుంచి ఎంపిక చేసిన స్టోర్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో లభ్యమవుతుంది. ఇవి రెండు పరిమాణాలు- 18 మరియు 32 కౌంట్‌ ప్యాక్‌లలో లభ్యమవుతాయి. ఈ 18 కౌంట్‌ ప్యాక్‌ ధర 432 రూపాయలు మరియు 32 కౌంట్‌ ప్యాక్‌ ధర 704 రూపాయలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు