పెట్రో బాదుడు యధాతథం... పట్టించుకోని కేంద్రం

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:13 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే వుంది. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెటల్ ముడిచమురు ధరల పెరుగుదలను సాకుగా చూసి దేశీయంగా కూడా పెంచుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో బుధవారం(24-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.54కి చేరింది. మంగళవారం(23-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.18గా ఉంది. అదేసమయంలో హైదరాబాద్‌లో బుధవారం(24-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.88.69కి చేరగా, మంగళవారం లీటర్ డీజిల్ ధర రూ.88.31గా ఉన్నది. 
 
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93గా ఉంది. అదేసమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.32గా ఉంది. ఇక కొల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.12గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.84.20గా ఉంది. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.34గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.88.44 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.90గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.86.31గా ఉంది. 
 
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.98గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 86.21గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.04గాను, లీటర్ డీజిల్ ధర రూ.90.63గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు