నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్రం స్పష్టత... పరీక్షలు ఎపుడంటే...?

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:11 IST)
జాతీయ స్థాయిలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను గత రెండు నెలలుగా వాయిదా వేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టంచేశాయి. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఇప్పటికే జేఈఈ (మెయిన్) అభ్యర్థులకు చెందిన హాల్ టికెట్లను జారీ చేసిందని, 6.5 లక్షల మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. కాగా, జేఈఈ (మెయిన్) సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ మధ్య, నీట్ సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు