రెండోసారి కరోనావైరస్ వస్తే దాని తీవ్రత అధికం అంటున్న అమెరికా వైద్యులు

మంగళవారం, 13 అక్టోబరు 2020 (17:44 IST)
కరోనా వైరస్ గురించి అమెరికా వైద్య నిపుణులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా వైరస్ ఒకసారి నయమైన తర్వాత మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి వస్తే మరోసారి రాదన్న భరోసా ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. పైగా మొదటిసారితో పోల్చితే రెండో సారి వైరస్ సోకినప్పుడు వాటి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.
 
నెవాడాకు చెందిన ఓ వ్యక్తి 48 రోజుల వ్యవధిలో మరోసారి కరోనా బారిన పడ్డారని అమెరికా వైద్య నిపుణులు తెలిపారు. దాంతో ఆ వ్యక్తి తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యారని తెలిపారు. ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ జర్నల్‌లో పరిశోధనాత్మక వివరాలు ప్రచురించారు. రెండుసార్లు కరోనా వచ్చిన కేసులు అమెరికాలోనే కాకుండా హాంకాంగ్, ఈక్వెడార్, బెల్జియం, నెదర్లాండ్ దేశాల్లోనూ వచ్చాయని లాన్సెట్ జర్నల్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు