ఏపీ కరోనా బులెటిన్, 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

శనివారం, 24 అక్టోబరు 2020 (19:20 IST)
గత కొద్ది రోజులుగా ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా 3,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,04,026కి చేరింది. అయితే ఇందులో 31,469 యాక్టివ్ కేసులుండగా 7,65,991 మంది కరోనా నుండి కోలుకున్నారు.
 
ఒక్క రోజే 6,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,556కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు.
 
అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులను పరిశీలించగా అనంతపురం 131, చిత్తూరు 404, ఈస్ట్ గోదావరి 445, గుంటూరు 378, కడప 203, కృష్ణా 344, కర్నూలు 60, నెల్లూరు 98, కాశం 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, వెస్ట్ గోదావరి 551 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 75,02,993 కరోనా టెస్టులు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు