గుంటూరులో నిబంధనలతో కూడిన లాక్‌డౌన్, ఇక్కడ మాత్రమే ఎందుకని?

శుక్రవారం, 17 జులై 2020 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. కేసులతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. ఏపీలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు 5000 మందికి పైగా కరోనా వ్యాధి బారినపడ్డారు.
 
వీరిలో 1829 మంది కరోనా మహమ్మారిని జయించగా ఇప్పటివరకు 32 మంది కరోనాకు బలైపోయారు. ఈ క్రమంలో కరోనాను అడ్డుకోవడానికి శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ వెల్లడించారు. నిత్యావసర సరకుల కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి కలదని స్పష్టం చేసారు.
 
ఇలా పూర్తిగా వారం రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని, అవసరమైతే తప్ప మిగతా విషయాలకు బయటకురావద్దని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు