కరోనా కొత్త స్ట్రెయిన్.. ఢిల్లీలో కర్ఫ్యూ. న్యూయర్ వేడుకల్లేవ్..?

గురువారం, 31 డిశెంబరు 2020 (10:25 IST)
కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 31వ తేదీ గురువారం రాత్రి నుంచి జనవరి 1వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ కర్ఫ్యూ కాలంలో ఎటువంటి బహిరంగ సమావేశాలకు, పార్టీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
 
ఇక దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్‌ వైరస్‌ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది. కరోనావైరస్ కొత్త ఉత్పరివర్తన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగరం సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.
 
ఇక యూకే నుంచి వచ్చిన వ్యక్తుల్లో నలుగురికి కొత్త వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. నాలుగు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రద్దీని అరికట్టేందుకు నూతన సంవత్సర వేడుకలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు