కార్యాలయాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి?

గురువారం, 23 జులై 2020 (13:05 IST)
దేశ వ్యాప్తంగా రోజురోజుకు కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతోంది. ప్రతిరోజూ దేశం మొత్తం మీద 35వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆఫీసులు, ఇతర పని ప్రదేశాల్లో (వర్క్ ప్లేసుల్లో) సాధ్యమైనంత వరకు వర్క స్టేషన్లు, కారిడార్లు, ఎలివేటర్లు, పార్కింగ్ ప్రదేశాలు, సమావేశపు గదులల్లో ఉద్యోగులు దగ్గరగా ఉండడంవల్ల కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. 
 
ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కింద సూచనలు పాటించాల్సి ఉంటుంది. 
  
• సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
• ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి. 
• సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ (కనీసం 20 సెకన్లు) శుభ్రం చేసుకోవాలి.
• దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
• ఉద్యోగులందరూ వారి ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి
• ఆఫీసు పరిసరాల్లో, డస్ట్ బిన్లలో, వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం ఖచ్చితంగా నిషేధించబడింది.
• ఉద్యోగులు అందరూ ఆరోగ్యసేతు యాప్‌ ఇనిస్టాల్ చేయడంతోపాటు ఉపయోగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
 
కార్యాలయాల దగ్గర నిర్దిష్టమైన నివారణ చర్యలు:
• ప్రతి ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్‌ తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయాలి.
• సాధారణ టెంపరేచర్, ఎలాంటి లక్షణాలు కనిపించని ఉద్యోగులు/ సందర్శకులను మాత్రమే లోపలికి అనుమతించాలి.
• ఒకవేళ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఎవరైనా ఉన్నట్టయితే వారు ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఆ సిబ్బంది ఆఫీసుకు రాకూడదు. అలాంటి ఉద్యోగులందర్నీ ఇళ్లనుంచే పనిచేసేందుకు అనుమతించాలి. దాన్ని సెలవుల కింద ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదు.
• అధికారుల వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా భౌతికదూరం పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకూడదు అన్న విషయాలపై వారికి అవగాహన కల్పించాలి.  
• ఒకవేళ డ్రైవర్లు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నివసిస్తున్నట్టయితే డ్రైవర్లను విధులకు దూరంగా ఉండాలని సర్వీసు ప్రొవైడర్లు/ ఆఫీసర్లు / స్టాఫ్ సూచించాలి.
• ప్రతిరోజు వాహనాలను 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. స్టీరింగ్‌, డోర్లు, హ్యాండిల్స్‌, తాళాలు కూడా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి.
• ఉద్యోగుల్లో వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలున్నవారు ఉంటే వారిని ప్రజలతో నేరుగా సంబంధం ఉండేచోట ఉంచకూడదు. ఇలాంటి ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేలా చూడాలి.
• అధికారులు/ సందర్శకులతోపాటు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలి. మాస్కు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ఆఫీసు పరిసరాల్లో అన్ని సమయాల్లో మాస్క్ ధరించి ఉండాలి.
• రోజువారీగా వచ్చే సందర్శకులను నియంత్రించాలి. తాత్కాలికంగా విజిటర్స్ ను నిలిపివేయాలి. ఒకవేళ ముఖ్యమైన పనిమీద వస్తే.. తగిన అనుమతి ఉంటేనే ఉన్నతాధికారిని కలవడానికి ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతించాలి.
• సమావేశాలు వీలైనంతమేర వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారానే కొనసాగించాలి.
• కోవిడ్-19 గురించి, నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు/ స్టాండీలు ఏర్పాటు చేయాలి. వైరస్ పై మరింత అవగాహన కల్పించేలా ఆడియో, వీడియో క్లిప్ లు ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలి.
• ఆఫీసు పనివేళలు, మధ్యాహ్న భోజనం, టీవిరామాల సమయం దశలవారీగా అమలుచేయాలి.
• పార్కింగ్, బయటి ప్రదేశాల్లో గుంపులుగా ఉండకూడదు. తప్పని సరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
• వ్యాలెట్‌ పార్కింగ్‌ ఉన్నట్లయితే.. వాహనాలను తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు, గ్లౌజ్‌లు, ఫేస్‌ షీల్డ్‌ను ధరించాలి. కారు తాళం చెవులు, స్టీరింగ్‌, గేర్‌పై డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ర్పే చేయాలి.
• వాష్ రూమ్స్ లో హ్యాండ్ శానిటైజర్లు, సబ్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
• ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో తరచూ తాకే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి
• ఉద్యోగులు పనిచేసే చోట భౌతిక దూరం పాటించేలా సీటింగ్ విధానం ఉండాలి.
• ఆఫీసులోకి వెళ్లేందుకు అధికారులు, స్టాఫ్, విజిటర్లకు ప్రత్యేకంగా ఎంట్రీ ఉండాలి.
• లిఫ్టులలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా వ్యక్తుల సంఖ్యను తగ్గించాలి.
• ఏసీల వినియోగం ఉంటే.. ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య, గాలిలో తేమ 40-70శాతం మధ్య ఉండేలా చూడాలి.
 
ఆఫీసులో కోవిడ్-19 కేసు నమోదైతే తీసుకోవాల్సిన చర్యలు:
ఆఫీసుల్లో ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కోవిడ్ కేసులు నమోదు కావని చెప్పలేము. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ కింద ఇవ్వబడిన చర్యలు తీసుకోవాలి.
• కార్యాలయాల్లో ఎవరైనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే అతను/ ఆమెను రూమ్ లో ఉండే వ్యక్తుల నుంచి వేరు చేసి వెంటనే ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి.
• అతను / ఆమెను డాక్టర్ పరీక్షించే వరకు మాస్కు/ ఫేస్ కవర్ ఇవ్వండి.
• వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి లేదా జిల్లా, రాష్ట్రస్థాయి హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి
 
ఆఫీసును మూసివేయడం:
• 1-2 పాజిటివ్‌ కేసులు బయటపడితే క్రిమిసంహారం చేసే విధానం తక్కువగా ఉంటుంది. కేవలం ఆ వ్యక్తి 48 గంటల్లో తిరిగిన ప్రదేశాలను శుభ్రం చేస్తే సరిపోతుంది. మొత్తం ఆఫీసు భవనాన్ని మూసేయాల్సిన అవసరం లేదు.
• ఒకవేళ ఎక్కువ కేసులు వస్తే మొత్తం భవనాన్ని/ బ్లాకును 48 గంటలపాటు మూసేసి సంపూర్ణంగా శుభ్రం చేయాలి. ఆ పని పూర్తయ్యేంతవరకూ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాలి.
• ఒకవేళ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల్లో రెండు రోజుల్లో ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే కనీసం 14 రోజులు క్వారెంటైన్‌కు వెళ్లాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు