వరల్డ్ కప్‌లో ఫేవరెట్స్ అంటూ ఎవరూ లేరు : విరాట్ కోహ్లీ

గురువారం, 14 మార్చి 2019 (15:58 IST)
ప్రపంచ కప్‌లో అసలు ఫేవరెట్స్ అంటూ ఎవరూ లేరని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 3-2 తేడాతో చేజార్చుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందిస్తూ, అసలు వరల్డ్‌కప్‌లో ఫేవరెట్స్ అంటూ ఎవరూ లేరన్నారు. వరల్డ్‌కప్‌లో ప్రతి టీమూ ఓ ముప్పే. ఓ టీమ్ వరల్డ్‌కప్‌లో బాగా ఆడటం మొదలుపెట్టింది అంటే.. వాళ్లను ఆపడం చాలా చాలా కష్టం అని కోహ్లీ అన్నాడు. ఇక అలాంటి టీమ్ కూడా సెమీస్‌లో ఇంటిదారి పట్టే అవకాశం ఉంది. ఆ రోజు ఆ టీమ్ కంటే బాగా ఆడే టీమ్ తగిలితే.. ఓటమి తప్పదన్నారు. 
 
అందువల్ల వరల్డ్‌కప్‌ను ఫేవరెట్స్‌గా ఏ టీమ్ కూడా మొదలుపెట్టదు. ఏ టీమ్ అయినా ప్రమాదకరమే. వెస్టిండీస్ టీమ్ ఎలా మారిందో మనం చూశాం. ఆ టీమ్ కూడా వరల్డ్‌కప్‌లో ప్రమాదకరమే. ఇంగ్లండ్ కూడా చాలా బలమైన జట్టే. ఆస్ట్రేలియా ఇప్పుడు చాలా సమతౌల్యంతో కనిపిస్తున్నది. మాది కూడా బలమైన జట్టే. న్యూజిలాండ్ టీమ్ బాగుంది. ఇక పాకిస్థాన్ అయితే తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు