వేసవిలో సోపులకు బదులు శెనగపిండి వాడితే..?

గురువారం, 22 మార్చి 2018 (16:43 IST)
వేసవి కాలంలో సోపులకు బదులు శెనగపిండిని వాడితే చర్మానికి ఎలాంటి హాని కలుగదు. ఇంకా ముఖానికి శెనగపిండి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శెనగపిండి చర్మంపై వుండే మృతకణాలను తొలగిస్తుంది. శెనగపిండిలోని బ్లీచింగ్‍ లక్షణాలు చర్మాన్ని తాజాగా వుంచుతాయి. శెనగపిండిని ఉపయోగించడం ద్వారా చర్మం మెరిసిపోతుంది. అందుకే సోపులకు బదులు శెనగపిండిని స్నానానికి ఉపయోగించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
శెనపిండితో మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు. బ్లాక్‍ హెడ్స్‌ను నివారించడానికి శెనగపిండి బాగా సహాయపడుతుంది. స్కిన్‍ క్లీనింగ్‍ కోసం ఉపయో గించే రసాయనిక సోపుల వల్ల చర్మంలో జిడ్డు ఏమాత్రం పోదు. ఇంకా డీహైడ్రేషన్‌ కారణంగా నిర్జీవంగా మారిపోతుంది. కానీ శెనపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి హాని వుండదు. 
 
శెనగపిండి జిడ్డును తొలగిస్తుంది. శెనపిండిలో ఉండే ఎక్సప్లోయేట్‍ లక్షణాలు చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. అదే సోపులను ఉపయోగించడం ద్వారా చర్మం గరుకుగా తయారవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శెనగపిండిని ఉపయోగించడం ద్వారా వేసవి చర్మ రుగ్మతల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు