అరటి పువ్వుతో ఆరోగ్యానికి మేలెంత?

ఆదివారం, 25 మార్చి 2018 (18:25 IST)
అరటి పండు పువ్వుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అర‌టి పువ్వు కూర‌ను వండుకుని తినడం ద్వారా స్త్రీల‌కు రుతుక్ర‌మం సక్రమంగా వుంటుంది.

బాలింతలకు మంచి ఆహారం. చాలా పోష‌కాలు ల‌భించ‌డం వ‌ల్ల అటు త‌ల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు అర‌టిపువ్వు కూర‌ను త‌ర‌చూ తింటుంటే వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. 
 
జీర్ణాశ‌యంలో అల్స‌ర్లు ఉన్న‌వారు అర‌టి పువ్వు కూర‌ను తినాలి. దీంతో అల్స‌ర్లు త‌గ్గుతాయి. హైబీపీ అదుపులో ఉంటుంది. త‌ద్వారా గుండె సంబంధ వ్యాధులు రావు. స్త్రీల‌లో గ‌ర్భాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. 
 
షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు అరటి పువ్వు కూర‌ను త‌ర‌చూ తినాలి. దీంతో రక్తం బాగా ప‌డుతుంది. ర‌క్తం వృద్ధి చెందుతుంది. అర‌టిపువ్వు కూర వ‌ల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ వంటివి దూర‌మ‌వుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు