హాయిగా నిద్రపోవాలంటే.. బ్లూ బెర్రీస్ తీసుకోండి..

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (17:54 IST)
బ్లూబెర్రీస్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. హార్మోన్లను సమతులం చేస్తుంది. దీంతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. అలాగే చెర్రీస్ తీసుకుంటే కూడా నిద్రలేమిని పక్కనపెట్టవచ్చు. చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ జీవన గడియారాన్ని నియంత్రించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
 
అలాగే నట్స్, వాల్‌నట్స్‌ తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. వీటిలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా వుంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఫలితంగా హాయిగా నిద్రపోవచ్చు. 
 
ఎండాలంలో దొరికే మామిడి పండ్లను తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి సమయంలో మంచి నిద్రకు మామిడి పండ్లను తీసుకోవడం ఉత్తమం. సాల్మన్, ట్యూనాలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి6లు ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా హాయిగా నిద్రకు ఉపక్రమించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు