ఉల్లిపాయలతో మధుమేహం మటాష్.. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదండోయ్..

బుధవారం, 20 మార్చి 2019 (15:48 IST)
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. మనం రోజూ తయారు చేసుకునే ఆహారాల్లో ఉల్లిపాయలు లేనివి చాలా అరుదు. చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగా తింటారు. పెరుగన్నంతోపాటు తీసుకుంటారు. ఎలా తీసుకున్నా మనకు ఉల్లి మేలే చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.


ఉల్లిపాయలోని విటమిన్ సి, బి1, బి6, యాంటీ సెప్టిక్, యాంటీబయాకిట్ గుణాలు చలికాలంలో వచ్చే శ్వాసకోస వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్‌ల నుండి కూడా రక్షిస్తాయి. 
 
ఉల్లిపాయల్లో అధికంగా ఉండే మరో పోషకం క్రోమియం. ఇది మధుమేహ వ్యాధి చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

ఇంకా జలుబుతో బాధపడేవారు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, కారం, శెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలను తింటే ఆస్తమా వ్యాధి దరిచేరదు. 
 
ఉల్లిపాయలను రసంలా చేసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఉప్పు, అన్నం వంచిన గంజి కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. చలికాలంలో కొంత మందికి చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్యతో బాధపడేవారు ఉల్లపాయ రసాన్ని రాసుకుని గంటపాటు ఉంచి కడిగితే ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు