విటమిన్ డి కరోనావైరస్‌కు మాత్రమే కాదు, క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది

గురువారం, 19 నవంబరు 2020 (22:46 IST)
విటమిన్ డి అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. విటమిన్ డి అధునాతన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయని యుఎస్ లోని బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్ నుండి అధ్యయన రచయిత పాలెట్ చాండ్లర్ చెప్పారు.
 
విటమిన్ డి అనేది సులువుగా లభించేది. ఇది దశాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. పరిశోధకులు విటమిన్ డి, ఒమేగా -3ల పనితీరుపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధన ఐదేళ్లపాటు సాగింది. పరిశోధన సమయంలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకునే సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ 25 కన్నా తక్కువ) ఉన్న 7,843 మందిలో, 58 మందికి మాత్రమే అధునాతన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
 
విటమిన్ డి ఏ పదార్థాల్లో వుంటుంది?
కోడిగుడ్లు: గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గుడ్డు సొనలో విటమిన్లు, ఖనిజ మరియు ఒమేగా -3 కొవ్వులకు అద్భుతమైన మూలం. గుడ్డు సొనలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే అనేక పోషకాలతో పాటు అధిక మొత్తంలో ఫోలేట్, విటమిన్ బి 12ను కలిగి ఉంటాయి. కాబట్టి కోడుగుడ్డును తీసుకోవడం మంచిది.
 
సాల్మన్ చేప: సాల్మన్ చేపలో విటమిన్ డి పుష్కలంగా వుంటుంది. సాల్మన్‌లో ఒమేగా -3 కొవ్వులు, ప్రోటీన్, పొటాషియం మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ చేపలను తినడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.
 
పుట్టగొడుగులు: ఈ కాలంలో పుట్టగొడుగులు పుష్కలంగా లభిస్తుంటాయి. వీటిలో విటమిన్ డి వుంటుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి వున్న ఆవు పాలు, నారింజ రసం, తృణధాన్యాలు వంటివి తీసుకుంటూ వుంటే విటమిన్ డి మాత్రలను మింగాల్సిన అవసరం వుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు