జనపనార విత్తనాలు తీసుకుంటే ఏంటి లాభం?

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (22:57 IST)
అధిక పోషకాలు మరియు ప్రోటీన్లతో నిండిన, తినడానికి ఆరోగ్యకరమైన విత్తనాలలో జనపనార విత్తనాలున్నాయి. వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. జీర్ణశయాంతర, గుండె జబ్బులు రాకుండా అడ్డుకునేందుకు సహాయపడే ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది.
 
అలాగే నువ్వులు. ఇవి సాంప్రదాయకంగా వంటగదిలో ఉపయోగిస్తుంటారు. ఈ విత్తనాలలో ప్రోటీన్, డైటరీ ఫైబర్, కొవ్వులు మరియు మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఆహార ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధిక రక్తపోటును నివారిస్తాయి. కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి.
 
జీలకర్ర విత్తనాలు వివిధ సంస్కృతుల వంటకాల్లో వాటిని రుచికి, ఔషధ లక్షణాలకు కూడా చాలాకాలంగా ఉపయోగించబడుతున్నాయి. జీలకర్రలో ఇనుము అధికంగా ఉండటం వల్ల కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకు సహాయపడటం, సాధారణ జలుబు లక్షణాల నుండి ఉపశమనం, గొంతు నొప్పిని తగ్గించడం, దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గించడం, వాపును తగ్గించడం, గుండె జబ్బులను నివారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు