శొంఠిని పేస్టులా చేసుకుని రాస్తే అవన్నీ తగ్గిపోతాయ్...

శనివారం, 29 డిశెంబరు 2018 (19:31 IST)
అనారోగ్య సమస్య వచ్చినప్పుడల్లా రకరకాల మందులను వాడుతుంటారు. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కనుక ఏ రోగానికైనా దీర్ఘకాలంగా మందులు వాడటం మంచిది కాదు. మన ఇంట్లో సహజంగా లభించే పదార్ధాలతోనే అజీర్తి లాంటి అనేక అనారోగ్యసమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలకు తరచూ జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి. వీటికి మన ఇంట్లో లభించే శొంఠి చక్కటి ఔషధంలా పని చేస్తుంది. అది ఎలాగో చూద్దాం.
 
1. శొంఠి పౌడర్‌ను పేస్ట్‌లా చేసి నుదిటికి రాస్తే తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. చాలా వరకూ తలనొప్పికి ఉపయోగించే థెరఫీలలో దీన్ని ఉపయోగిస్తుంటారు. గొంతుకు రాయడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
 
2. శొంఠి పౌడర్‌ను చెరుకు రసానికి మిక్స్ చేసి తాగడం వల్ల పొట్టలో చికాకును తొలగిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.
 
3. శొంఠి పౌడర్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రెండుమూడు టేబుల్ స్పూన్ల పౌడర్లో నీళ్ళు మిక్స్ చేసి వేడి చేసి, తాగడం వల్ల జాయింట్ వాపులను తగ్గిస్తుంది. మోకాళ్ళకు ఈ పేస్ట్‌ను లేదా శొంఠి కలిపిన వాటర్‌ను అప్లై చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
 
4. శొంఠి పౌడర్ సాధారణంగా లేదా సీజనల్‌గా వచ్చే జలుబును నివారించడంలో బాగా సహాయపడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు శొంఠి పౌడర్‌కు కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు బెల్లం మిక్స్ చేసి కషాయం చేసి తాగడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. శొంఠి పౌడర్‌కు లవంగాల పొడి, ఉప్పు మిక్స్ చేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జలుబు, దగ్గు నివారించబడతాయి.
 
5. శొంఠిలో థర్మోజనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్‌ను కరిగించి ఒబేసిటి తగ్గించగలుగుతాయి. కనకు శొంఠిని తీసుకుంటే శరీరంలో నిల్వ చేరిన ఫ్యాట్ కరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు