మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే...

శుక్రవారం, 1 జూన్ 2018 (10:34 IST)
నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. ఈ నేరేడు పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించుటకు ఉపయోగపడుతుంది. అరటి పండు గుజ్జుని తీసుకుని అందులో చింతపండు, ఉప్పువేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తవిరేచానాలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువగా పదార్థాలు తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.
 
ఎండలో ఎక్కువగా తిరిగివచ్చిన వారికి పచ్చి మామిడి కాయను ముక్కలుగా కోసి ఉప్పులో అద్ది ఇస్తే వెంటనే శక్తి పొందుతారు. బంగాళాదుంపలపై కనిపించే ఆకుపచ్చని రంగులోని మచ్చల్లో సెలెసైన్ అనే విషపదార్ధం ఉంటుంది. అవి తినరాదు.
 
ఒక కప్పునీటిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకుని పడుకునే ముందుగా త్రాగితే మంచి నిద్రపడుతుంది. ముత్రపిండాల సమస్యలు ఉన్నవారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది. తేనెటీగలు కుట్టినప్పుడు వాటి చికిత్సకు బిళ్ళ గన్నేరు ఆకులు చాలా ఉపయోగపడుతాయి. అనాస పండ్ల రసాన్ని చర్మానికి పైపూతగా రాస్తే గజ్జి, తామర, ఇతర సంబంధిత వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి.
 
ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే ఆగిపోతాయి. పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తినడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మద్యాహ్నం పూట త్రాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ధనియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
 
పచ్చి గుడ్లను తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిదికాదు. కారాన్ని అధికంగా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బిల్వ పత్రాలకు శరీర చెమట వాసనను అరికట్టే గుణం ఉంది. వీటిని రుబ్బి శరీరానికి పట్టించి స్నానం చేస్తే చెమట వాసన రాదు. మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే నరాల బలహీనత క్రమంగా తగ్గుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు