వివాహ వేడుక జరిగిన ఇంట్లో.. ఇలా చేస్తే..?

గురువారం, 21 మార్చి 2019 (10:53 IST)
వివాహ వేడుక జరిగిన ఇంట్లో ఆరునెలలు దాటకుండా తద్దినాలు పెట్టకూడదు. మనకి ఆరునెలల సమయం అంటే అది పితృదేవతలకు ఒక పూటతో సమానం. ఆరు నెలలు కాకముందే తద్దినాలు పెట్టవలసి వస్తే, రెండు కార్యక్రమాలకు వారిని ఒకే పూట ఆహ్వానించినట్టు అవుతుంది. 
 
వివాహ సమయంలో పితృ దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనం కోరుకునే సందర్భం ఉంటుంది. అలా వివాహ వేడుకకి వచ్చిన పితృదేవతలను, అదే పూట తద్దినానికి ఆహ్వానించడం వారి మనసుకు కూడా కష్టం కలిగిస్తుంది.
 
అందువలన వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితే అయితే ఆ కార్యక్రమాన్ని నది తీరాల్లో జరిపించడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు.
 
ఇక నూతనంగా గృహ ప్రవేశం చేసిన వారి విషయంలోనూ ఇదే పద్ధతి వర్తిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇవి పాటించకపోతే... దోషాలు, ఇబ్బందులు తప్పవని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు