కరోనా ఓ వైపు.. ఎబోలా మరోవైపు.. నలుగురు మృతి ఎక్కడ?

మంగళవారం, 2 జూన్ 2020 (11:24 IST)
ebola virus
ఒకవైపు కరోనా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తుంటే.. ఎబోలా వైరస్ మళ్లీ తొంగిచూసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పశ్చిమాన ఎబోలా వ్యాప్తి చెందడంతో నలుగురు మృతి చెందారని ఆరోగ్య మంత్రి ఎటెని తెలిపారు. 
 
ఈక్వటేర్ ప్రావిన్స్‌లోని పశ్చిమ నగరమైన ఎంబండకాలో ఈ అంటువ్యాధులు గుర్తించినట్లు ఎటెని లాంగోండో సోమవారం చెప్పారు. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. ఇంకా నాలుగు అనుమానాస్పద కేసులు ఉన్నాయని వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 
 
డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ ప్రకారం, ఈక్వెటూర్ ప్రావిన్స్‌లో చివరిసారిగా 2018లో 54 కేసులు, 33 ఎబోలా మృతులు నమోదైనాయి. కాంగో దేశంలోని తూర్పు భాగంలో చరిత్రలో రెండవ అతిపెద్ద ఎబోలా మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగో ఇప్పటికీ శ్రమిస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త వ్యాక్సిన్లను ఉపయోగించినప్పటికీ.. 2,260 మందికి పైగా మరణించారు. 
 
ఇప్పటికే కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో ఆ దేశం నానా తంటాలు పడుతోంది. మే 31 నాటికి 3,195 మంది అంటువ్యాధుల బారిన పడగా, మృతి చెందారు. కానీ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు కోవిడ్ -19 కేసులు కనుగొనబడలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు