కొబ్బరి చెట్టెక్కిన మంత్రి.. కిందికి దించలేక సిబ్బందికి తల ప్రాణం తొకకు వచ్చిందట...

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:45 IST)
కొబ్బరి చెట్ల పెంపకంపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా మంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. తన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏకంగా కొబ్బరి చెట్టెక్కి అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు అయితే ఎక్కడం బాగానే వుందిగానీ, దిగడం మాత్రం మంత్రిగారి వల్ల కాలేదు. దీంతో మంత్రిని కిందికి దించేందుకు సిబ్బందితో పాటు స్థానికులకు తలప్రాణం తోకకు వచ్చింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా. శ్రీలంక కొబ్బరికాయల శాఖా మంత్రి. పేరు అరుందికా ఫెర్నాండో. ఇంతకీ ఈ మంత్రిగారు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారో తెలుసుకుందాం. 
 
పొరుగు దేశమైన శ్రీలంకలో కొబ్బరి కాయల కరువు వచ్చింది. ప్రస్తుతం అక్కడ 70 కోట్ల కొబ్బరి కాయలు అదనంగా కావాలి. ప్రస్తుతమున్న సరఫరా.. పారిశ్రామిక అవసరాలకు కూడా సరిపోవడం లేదు. దీనికి పరిష్కారం కొబ్బరి సాగును పెంచడమే. మరి ఈ దిశగా ప్రజల్ని ప్రోత్సహించి సమస్య తీవ్రతను వారికి అర్థమయ్యేలా చేయాలంటే ఏం చేయాలి..? శ్రీలంకకు చెందిన కొబ్బరికాయల శాఖ మంత్రికి కూడా సరిగ్గా ఇదే ప్రశ్నకు వేసుకున్నారు. 
 
ఇందుకు సమాధానం కూడా ఆయన కనుగొన్నారు. ఇందులోభాగంగా, ఆయన స్వయంగా కొబ్బరి చెట్టెక్కి.. సమస్య తీవ్రత ప్రజల మెదళ్లోకి ఇంకేలా మాంచి ఉపన్యాసం దంచారు. 'అందుబాటులో ఉన్న ప్రతి సెంటు భూమి కూడా కొబ్బరి సాగుకు మళ్లించాలి. కొబ్బరి కాయల ఉత్పత్తిని పెంచి విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోవాలి' అంటూ చెట్టుపై నుంచి ఆయన ఉపదేశించారు. 
 
మంత్రిగారి కష్టం చూసిన తర్వాత తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం ఆకాశాన్నంటిన కొబ్బరి కాయల రేట్లను తగ్గించేందుకు పూనుకుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. చెట్టెక్కేందుకు ఉపయోగపడే సాధనం నుంచి మంత్రిని కిందికి దించేందుకు, దాన్ని నుంచి విడిపించేందుకు సిబ్బందికి తల ప్రాణం తొకకు వచ్చింది. ఈ సంఘటన స్థానికుల్లో నవ్వులు పూయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు