అల్లర్లు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతా : ట్రంప్ హెచ్చరిక

మంగళవారం, 2 జూన్ 2020 (16:27 IST)
అమెరికాలోని మిన్నియా పోలీసులు ఓ నల్లజాతీయుడిని ఉద్దేశ్యపూర్వంగా హత్య చేశారు. మృతుని పేరు జార్జ్ ఫ్లాయిడ్. ఈ హత్య అమెరికాలో అల్లర్లకు తెరలేపాయి. వీటిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తాను 'లా అండ్ ఆర్డర్' అధ్యక్షుడిననీ అల్లర్లలను అణచి వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ అమెరికా సైన్యాన్ని మోహరిస్తారనని హెచ్చరించారు. 
 
అమెరికాలోని మిన్నియా పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఓ కేసులో పట్టుకున్నారు. ఆ తర్వాత 43 యేళ్ళ ఫ్లాయిడ్‌ను నేలపై పడేసి అతని గొంతుపై ఓ పోలీసు అధికారి తన మోకాలుతో నొక్కిపట్టాడు. దీంతో ఫ్లాయిడ్‌కు ఊపిరి ఆడలేదు. తనకు ఊపిరాడటం లేదంటూ పలుమార్లు ప్రాధేయపడినా ఆ అధికారి వదిలిపెట్టలేదు. ఇదే అమయంలో ఫ్లాయిడ్‌కు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలో అల్లర్లకు దారితీసింది. 
 
మరోవైపు, అమెరికా హెచ్చరికలు జారీచేసిన కొన్ని క్షణాల్లోనే అమెరికా మిలటరీ వాహనాలు పెద్ద ఎత్తున వైట్‌హౌస్ సమీపంలోని పెన్సిల్వేనియా ఎవెన్యూకు తరలివచ్చాయి. లాఫాయెట్ పార్క్ వద్ద మిలటరీ పోలీసులు, అధికారులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. గవర్నర్లు నేషనల్ గార్డులతో ఆందోళనలను రూపుమాపి శాంతిని పునరుద్ధరించకపోతే.. తాను వేలాది మంది సైనికులను పంపాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు