విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

శనివారం, 26 సెప్టెంబరు 2020 (11:55 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. ఈయనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం రూ.12 లక్షల అపరాధం విధించింది. 
 
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలోభాగంగా, కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడనే కారణంతో కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. 
 
అయితే, కాగా, కోహ్లీ కూడా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ క్యాచ్‌ని రెండు సార్లు డ్రాప్ చేయడం ద్వారా కోహ్లీ విమర్శలను కూడా మూటకట్టుకున్నాడు. ఫలితంగా కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. 
 
మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జట్టు సారధి అయిన కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మొత్తాన్ని కోహ్లీ మ్యాచ్ ఫీజు నుంచి వసూలు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు