అమెరికాలో భారతీయ విద్యార్థులు ఇంతమంది ఉన్నారా?

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:44 IST)
అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2017 కంటే 2018లో 1.68శాతం పెరిగిన ఈ సంఖ్య... అదే సమయంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం 1.7 శాతానికి తగ్గిపోయింది.

తాజా సర్వే తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ వెల్లడించిన ఈ సర్వేలో.. భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగినా వృద్ధిశాతం మాత్రం గణనీయంగా తగ్గిందని తేలింది.

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 2017 కంటే 2018 లో మన వారు 4,157 మంది పెరిగారు. అదే సమయంలో అగ్రరాజ్యంలో చదువు కోసం వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 26,120 తగ్గింది.

చైనా విద్యార్థులు 147 మంది తగ్గారు. అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ తాజాగా ఈ నివేదిక విడుదల చేసింది.

భారతీయ విద్యార్థుల సంఖ్య కొద్దిగా పెరిగినా వృద్ధి శాతం బాగా పడిపోయిందని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత మూడేళ్ల ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) పూర్తయ్యే లోపు హెచ్‌1బీ వీసా రానందున రెండో పీజీ చదువుతున్నారు.

దీంతో విద్యార్థి వీసాపై ఉన్న వారి సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉందని భావిస్తున్నారు. మూడు నాలుగేళ్లుగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తోపాటు జర్మనీ, ఐర్లాండ్‌ తదితర దేశాలను ఎంచుకుంటున్నారని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు