ఆర్మీని వదలని కరోనా.. జవాను ఆత్మహత్య.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత..

శుక్రవారం, 15 మే 2020 (16:50 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకీ విస్తరిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌‌ను కరోనా కారణంగా మూసేవేశారు. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసేసి.. ఫ్యుమిగేషన్‌, శానిటేషన్‌ చేశారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆర్మీ జవాన్‌కు మే 13న పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ అని తేలింది. 
 
దీంతో అతినిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్మీ జవాన్‌ ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. తుపాకీతో తనకు తానే కాల్చుకుని జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపోతే..  కోవిడ్‌-19తో పోరాడేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు