ఇండోర్‌లో 84 కేసులు.. నలుగురు మృతి.. బెంగాల్‌లో 101 మంది డిశ్చార్జ్

శుక్రవారం, 29 మే 2020 (19:59 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తమ్మీద ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,344కు చేరిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి ప్రవీణ్ జాడియా శుక్రవారం తెలియజేశారు. అలాగే కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందినట్లు చెప్పారు. ఫలితంగా ఇండోర్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 136కు చేరింది.
 
అయితే పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా ఆస్పత్రిలో వందమందికి పైగా కaవిడ్-19 బాధితులు విజయవంతంగా కోలుకున్నారు. వారిని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉలుబెరియాలోని సంజీబన్ హాస్పిటల్ నుంచి మొత్తం 101 మంది డిశ్చార్జ్ కాగా.. వీరిలో 54 మంది మహిళలు, 42 మంది పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వీరందరినీ అంబులెన్సుల్లో ఇళ్లకు తరలించగా.. ఆస్పత్రి నుంచి బయల్దేరే ముందు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు