డీపీఎంసీ చీఫ్ అమృత ధావన్ బట్టలను యూపీ పోలీసులు చింపేశారట..!

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (13:53 IST)
Amrita Dhawan
ఢిల్లీ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ (డీపీఎంసీ) అధ్యక్షురాలు అమృత ధావన్ బట్టలను ఉత్తరప్రదేశ్ పోలీసులు చింపివేశారు. హత్రస్‌కు వెళ్తున్న రాహుల్‌, ప్రియాంక గాంధీలను యమునా ఎక్స్‌ప్రెస్ వేపై గురువారం యూపీ పోలీసులు అడ్డుకునే సమయంలో జరిగిన తోపులాటలో అమృత కూడా ఉన్నారు. తోపులాట జరిగిన సమయంలో తన బట్టలను పోలీసులు చింపేశారని అమృత సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు బలాన్ని ప్రదర్శించాలనుకుంటే.. నేరస్తులపై చూపించండి.. మహిళల బట్టలను చింపేయడం వల్ల ఏం సాధిస్తారంటూ ఆమె ప్రశ్నించారు.
 
అమృత వ్యాఖ్యలపై నోయిడా డీసీపీ వ్రిందా శుక్లా స్పందించారు. రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న సమయంలో తానే అక్కడే ఉన్నానని తెలిపారు. మహిళా పోలీసులు కూడా ఉన్నారు. ఏ మహిళ గౌరవానికి కూడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని డీసీపీ శుక్లా స్పష్టం చేశారు.
 
హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసి ఓదార్చడానికి బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి డిల్లీకి తిప్పి పంపేసిన అనంతరం ప్రియాంక గాందీ ట్వీట్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు