ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన భారత వైమానిక దళం...?

శుక్రవారం, 20 నవంబరు 2020 (07:44 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై భారత వైమానిక దళం మరోమారు విరుచుకుపడినట్టు సమాచారం. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ఈ దాడులు నిర్వహించిందని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ పీటీఐని ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్‌లను ప్రసారం చేస్తున్నాయి. 
 
భారత వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారని, 20 మందికి పైగా గాయపడ్డారని జాతీయ మీడియా ప్రకటించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు సిద్ధమౌతుండగా వైమానిక దాడులు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. 
 
అయితే ఎల్‌ఓసీ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లుగా జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారమౌతున్న కథనాల్లో నిజం లేదని భారత ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ జనరల్ పరమ్‌జిత్ స్పష్టం చేశారు. కాగా, గతంలో కూడా భారత వైమానిక దళం ఇదే తరహా మెరుపు దాడులు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడులతో ప్రపంచం యావత్ విస్తుపోయింది.

 

Reports of Indian Army's action in Pakistan-occupied Kashmir (PoK) across the Line of Control are fake: Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh
(file photo) pic.twitter.com/uHlULDWydh

— ANI (@ANI) November 19, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు