లాడ్జిలో ఒకే గదిలో అమ్మాయి - అబ్బాయి ఉంటే తప్పేంటి?

ఆదివారం, 8 డిశెంబరు 2019 (10:38 IST)
మద్రాసు హైకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. లాడ్జీలో ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉంటే తప్పులేదని స్పష్టం చేసింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండడం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జిలోని ఒక గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయన్న కారణాలతో పోలీసులు ఇటీవల ఆ లాడ్జిని మూసివేయించారు. లాడ్జి యాజమాన్యం దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 
 
కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికాని యువతీయువకులు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని, కాబట్టి అదెలా తప్పవుతుందని ప్రశ్నించింది. 
 
పైగా, సహజీవనాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు ఉండడాన్ని కూడా తప్పుబట్టలేమని, అవి ఉండడంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. లాడ్జి మూసివేతలో నిబంధనలు పాటించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. వెంటనే లాడ్జీకి వేసిన సీలును తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు