జైపూర్ జైల్లో పాకిస్థాన్ ఖైదీని చంపేశారు...

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:50 IST)
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఒక్క దేశ ప్రజలు మాత్రమే కాదు.. దేశంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే ఈ దారుణ ఘటన. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌ జైల్లో ఉన్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఖైదీని భారతీయ ఖైదీలు కొట్టి చంపేశారు. 
 
ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు గూఢచర్యం ఆరోపణలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మృతుడిని షకీర్‌గా గుర్తించారు. ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అతడిపై దాడిచేసి కొట్టిచంపేశారు. దీనిపై సమాచారం అందగానే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు జైలుకు చేరుకుని విచారణ చేపట్టారు.
 
దీనిపై జైళ్ళ శాఖ ఐజీ రూపేందర్ సింగ్ స్పందిస్తూ, "‘ఓ పాకిస్థాన్ ఖైదీ జైపూర్ కేంద్ర కారాగారంలో హత్యకు గురైనట్టు సమాచారం అందింది.. దానిపై వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నాం" అని వెల్లడించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఆగ్రహంతో ఉన్న భారతీయ ఖైదీలు ఈ దారుణానికి ఒడిగట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు