ఆదివారం సూర్యునికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే?

శనివారం, 6 జూన్ 2020 (20:23 IST)
రాజగ్రహం అని పిలువబడే సూర్యభగవానుడిని.. రోజూ నమస్కరించి స్తుతిస్తే సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి. రాజభోగం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి చేకూరుతుంది. అనతి కాలం నుంచే భారతీయ సంస్కృతిలో భాగం అయిన సూర్య నమస్కారంతో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. ఆధ్యాత్మిక చింతన కూడా పెంపొందుతుంది. సూర్య భగవానుడిని ఆదివారం పూట స్తుతించి.. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించే స్తుతిస్తే.. అనారోగ్య సమస్యలు వుండవు. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
Chakkara Pongal
 
నవగ్రహాల్లో రాజగ్రహంగా వున్న సూర్యుడు సింహరాశికి అధిదేవత. సింహ రాశిలో సూర్యుడు సంచరించే మాసంలో జన్మించిన జాతకులకు రాజయోగ ప్రాప్తం వుంటుంది. సిరిసంపదలకు వెల్లివిరుస్తాయి. ఆ జాతకులు ఉన్నత పదవులను అలంకరిస్తారు. 
 
అందుకే సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే రోజూ సూర్య నమస్కారం చేయడం.. ఆదివారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. స్నానమాచరించి నిష్ఠతో పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు వుండవు. అలసట వుండదు. నీరసం పరావుతుంది. కీర్తి వరిస్తుంది. రాజకీయాల్లో వున్న వారికి ఉన్నత పదవులు చేకూరుతాయి. చీకటిని పారద్రోలి ప్రకాశాన్ని ఈ లోకానికి అందిస్తున్న సూర్యభగవానుడు.. ఈ లోకంలోని సమస్త జీవులకు మెరుగైన ఫలితాలిస్తాడని విశ్వాసం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు