నేడు ఈ సంవత్సరపు ఆఖరి సూర్యగ్రహణం...

సోమవారం, 14 డిశెంబరు 2020 (09:28 IST)
ఈ యేడాది ఆఖరి సూర్యగ్రహణం సోమవారం కనిపించనుంది. ఇది వృశ్చిక, మిధున రాశుల్లో సంభవించనుంది. సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలయ్యే గ్రహణం రాత్రి 12.23 గంటల వరకూ ఉంటుందని పండితులు వెల్లడించారు. అయితే, ఈ సూర్యగ్రహణం మాత్రం మన దేశంలో మాత్రం కనిపించదు. గ్రహణం కనిపించని చోట దాని ప్రభావం ఉండబోదని పండితులు తెలిపారు.
 
ఇకపోతే, ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణా ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చే సంవత్సరం తొలి సూర్య గ్రహణం జూన్ 10న ఏర్పడనుంది. ఇది ఇండియాలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఆపై డిసెంబర్ 4న మరో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇదికూడా భారత్‌లో కనిపించదని నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు