Mukkanuma 2021: తొమ్మిది పిండివంటలు.. గోవులకు విశ్రాంతి

శనివారం, 16 జనవరి 2021 (11:13 IST)
Mukkanuma
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది ముక్కనుమ. ఈ పండుగ శనివారం రోజున తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 
 
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అలాగే ఈ రోజును దూడల పండుగ అని కూడా అంటారు. ముక్కనుమ నాడు గోవులను, ఎద్దులను మాత్రమే పూజిస్తారు. పశువుల పండుగ అంటేనే పశువులకు విశ్రాంతి. ఆ రోజు పొలం పనులు చేయరు.
Mukkanuma


ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూసి అందంగా అలంకరిస్తారు. కొమ్ములకు మువ్వలు, మెడలో గంటలు కడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు