భారతదేశంలో క్రౌడ్ ఫండింగ్ విప్లవానికి ఏపీ, తెలంగాణ తోడ్పాటు: మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరి

గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:43 IST)
శ్యామ్‌ ప్రసాద్‌ తన సొంత రెస్టారెంట్‌ను తెరువాలనే తన కలను సాకారం చేసుకున్నారు, కానీ ఆయన తమ నవజాత కుమార్తె యొక్క పరిస్థితి చూసిన తరువాత కుప్పకూలిపోయారు. పుట్టిన నెలరోజులకే, ఆయుషీ  హృదయంలో రంధ్రాలు ఉన్నాయని గుర్తించడంతో పాటుగా ఆమె శ్వాస వ్యవస్థలో లోపాలున్నాయని గుర్తించారు. ఆమెకు పలుమార్లు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది. తన కుమార్తె జీవితం ప్రమాదంలో పడటంతో, మరో ఆలోచన లేకుండా ఆయన తన రెస్టారెంట్‌ను అమ్మేశారు.
 
ఆయన ఎలాగోలా చేసి గుండె ఆపరేషన్‌ను స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో చేయించారు కానీ ఈ చికిత్స మధ్యలోనే ఆయన తన దగ్గర ఉన్న మార్గాలు మూసుకోవడంతో మిలాప్‌పై క్రౌడ్‌ ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. దక్షిణాసియాలో అతిపెద్ద క్రౌడ్‌ ఫండింగ్‌ వేదిక మిలాప్‌. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది అపరిచితుల మద్దతుతో ఆయన 7.9 లక్షల రూపాయలను శస్త్రచికిత్స కోసం సమీకరించగలిగారు.
 
సంవత్సరాల తరబడి పొదుపును వైద్య అత్యవసరాలు రోజులలోనే మింగేస్తాయి. కొన్నిసార్లు అది కూడా సరిపోదు. కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రియమైనవారిని కాపాడుకునేందుకు ఉన్న అత్యుత్తమ అవకాశాలను గురించి అన్వేషిస్తూనే ఉంటారు. అక్కడే మిలాప్‌ లాంటి వేదికలు సహాయపడుతుంటాయి.
మయూఖ్‌ చౌదరి, సీఈవో అండ్‌ కో-ఫౌండర్‌, మిలాప్‌ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌ నుంచి పలు క్యాంపెయిన్‌ల ద్వారా వైద్య అవసరాల కోసం అత్యధిక మొత్తాన్ని సమీకరించారు. గత ఆరు నెలల్లో ఈ మొత్తాలు 170 రెట్లు వృద్ధి చెందాయి’’ అని అన్నారు. ఆన్‌లైన్‌ క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా ప్రజలు తమ అవసరాలను స్నేహితులు, ప్రియమైన వారితో ఒక్క క్లిక్‌తో చేరుకోవడంతో పాటుగా విస్తరించిన నెట్‌వర్క్‌ నుంచి సైతం నిధులను సమీకరిస్తున్నారు లేదంటే పూర్తిగా అపరిచితుల నుంచి సైతం వేగంగా, సురక్షితంగా, పారదర్శక విధానంలో నిధులను సమీకరిస్తున్నారు.
 
గత కొద్ది సంవత్సరాలుగా, ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌కు అసాధారణ ప్రాచుర్యం కలుగుతుంది, కానీ ఇది సవినయ  ఆరంభాన్ని ప్రారంభంలో చేసింది. నేడు అధికంగా హెల్త్‌కేర్‌ క్రౌండ్‌ఫండింగ్‌ కోసం దీనిని వినియోగిస్తున్నారు. 2015లో ఈ క్రౌడ్‌ ఫండింగ్‌ను అధికంగా విద్యావసరాల కోసం వినియోగిస్తే, 2016లో అకస్మాత్తుగా ఐదు రెట్ల వృద్ధిని వైద్య మరియు అత్యవసరాల కోసం వినియోగించడం ఒక్క సంవత్సరంలోనే నమోదుచేసింది.
 
ప్రతి సంవత్సరం ఇతర కారణాల కోసం అంటే మహిళా సాధికారిత, పెంపుడు జంతువులు, పశువుల కోసం వంటి వాటికి సైతం ఫండ్‌ రైజర్లను చేయడం పెరిగింది. అయినప్పటికీ, అత్యవసర వైద్య అవసరాల కోసం తోడ్పాటును ఇవ్వడం మాత్రం అత్యధికంగా ఉంది. మరీముఖ్యంగా దీర్ఘకాలపు మరియు అనుకోని చికిత్సలైనటువంటి క్యాన్సర్‌ కేర్‌, చిన్నారుల కోసం అవయవ మార్పిడి వంటి వాటికి ఎక్కువగా తోడ్పడుతున్నారు.
 
‘‘మొత్తంమ్మీద, ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించిన నాటి నుంచి నిధుల సమీకరణ అనేది సంయుక్తంగా మిలాప్‌ ద్వారా ప్రతి సంవత్సరం పెరుగుతూ దాదాపు 200 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ప్రతి సంవత్సరం ఫండ్‌ రైజర్ల సంఖ్య 300 రెట్ల వృద్ధిని నమోదుచేస్తుంది. హైదరాబాద్‌ ఈ దిశగా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం మిలాప్‌ ప్రయాణంలో మాత్రమే కాదు. భారతదేశంలో క్రౌడ్‌ ఫండింగ్‌ విప్లవానికీ తోడ్పాటునందిస్తుంది. ఇప్పటి వరకూ, దాదాపు 110 కోట్ల రూపాయలను ఏపీ, తెలంగాణాలలో పలు కారణాల కోసం సమీకరించారు. దీనిలో దాదాపు 70%కు పైగా  హైదరాబాద్‌ నుంచి ఉన్నాయి.
వాస్తవానికి, విదేశాలలోని గ్రూప్‌లు మరియు కమ్యూనిటీల నుంచి ఈ రాష్ట్రాలు అసాధారణ మద్దతు అందుకున్నాయి. తెలుగు ప్రజలు చురుగ్గా పలు కారణాలకు తమ మద్దతును మిలాప్‌ ద్వారా అందించారు. ఆశ్చర్యకరంగా, డయాస్పోరిక్‌ కమ్యూనిటీలు దాదాపు 40% నిధుల తోడ్పాటును రెండు తెలుగు రాష్ట్రాలకూ అందించారు. ఇతర భూభాగాలకు ఇది 30%వరకూ ఉంది. విదేశాలలో చూసినప్పుడుయుఎస్‌ అతి పెద్ద వాటాను ఆక్రమించింది. ఈ మద్దతు అందించిన ఉత్సాహంతోనే మా వార్షికోత్సవం సందర్భంగా పూర్తిగా మా ఫీజును రద్దు చేసుకోవడంతో పాటుగా మిలాప్‌ను ఉచిత వేదికగా మార్చాము’’ అని చౌదరి జోడించారు.
 
బాగా అనుసంధానించబడిన మరియు డిజిటల్‌గా చురుకైన డయాస్పోరా మరియు సన్నిహితంగా ఉండే ఆన్‌లైన్‌ గ్రూప్‌లు, కమ్యూనిటీలు, హైదరాబాద్‌ నగరంలో 95%కు పైగా ప్రజలు తమకు కావాల్సిన నగదును మిలాప్‌ నుంచి అదనపు మద్దతు లేకుండా సమీకరించడంలో తోడ్పడుతున్నారు.
 
‘‘మా పాప ఆయుషీకి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స జరిగిన తరువాత కానీ నేను ఉపశమనం పొందలేకపోయాను. ఎందుకంటే ఇంకా ఎంతోదూరం వెళ్లాల్సి ఉంది. ఆమెకు ఇప్పటికీ శ్వాసనాళం కోసం శస్త్రచికిత్స అవసరం పడటంతో పాటుగా మ్యాక్సిల్లోఫేసియల్‌ సర్జరీ కూడా చేయాల్సి ఉంది. తద్వారా ఆమె సరిగా శ్వాసించగలదు. మిలాప్‌పై నేను ప్రారంభించిన క్రౌడ్‌ ఫండింగ్‌ క్యాంపెయిన్‌ కారణంగా అతి ముఖ్యమైన శస్త్రచికిత్సలను నేను పూర్తి చేయించడంతో పాటుగా మా కుమార్తెకు పునర్జన్మను అందించాం’’అని సంతోషంగా శ్యామ్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఇప్పుడు ఆయన నవజాత కుమార్తె వేగంగా కోలుకుంటుంది.
 
తమ ప్రియమైన వారిని కాపాడుకోవడానికి క్రౌడ్‌ఫండ్‌ను ప్రయత్నిస్తున్న శ్యామ్‌ లాంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే అసాధారణ హీరోలు అయినటువంటి ప్రదీప్‌ నాయర్‌, నీహారీ మండలి, అర్షద్‌ షేక్‌, సురేష్‌ ఎడిగ కూడా ఉన్నారు.  వీరు నగరంలో పలు  కారణాల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేశారు. వలస కార్మికులకు సహాయం చేయడానికి, వేధింపుల బాధితులు, ఆఖరకు వీధి శునకాలకు సహాయపడటానికి కూడా క్రౌడ్‌ ఫండింగ్‌ చేశారు. 
 
ఇప్పుడు మరింత మంది ప్రజలు ఒకరికొకరు సహాయపడటానికి డిజిటల్‌ మార్గం ఎంచుకుంటున్నారు. నేడు, 17 సంవత్సరాల వయసు కలిగిన స్మృతి, 14 సంవత్సరాల మిషికా మరియు అన్విత; 11 సంవత్సరాల రిధి వంటి వారు డిజిటల్‌ ప్రపంచం వినియోగించుకుని వలస కార్మికులకు భోజన సౌకర్యాలు కల్పించడం, బాలికల విద్యకు సహాయపడటం, వీధి శునకాలకు మేత, సౌర విద్యుత్‌ పట్ల అవగాహన కల్పించడం చేస్తున్నారు. అంతర్జాతీయంగా వీరు లక్షలాది రూపాయల నిధులను సమకూర్చడంతో పాటుగా పారదర్శకంగా వేలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు