ఆడపిల్ల పుట్టిందని తల్లి, బిడ్డను గులాబీ పాన్పుపై పడుకోబెట్టారు, ఎక్కడ?

సోమవారం, 28 డిశెంబరు 2020 (19:21 IST)
ఆడపిల్ల అంటే మొదటి నుంచి చిన్నచూపే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేటికీ అబ్బాయి కావాలనే పూజలు చేస్తుంటారు. అమ్మాయి పుడితే భారంగా భావిస్తారు. వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుడితే అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు తప్పవు. వారసుడే కావాలన్నది చాలామంది ఆశ.
 
కొంతమంది అయితే పుట్టిన ఆడబిడ్డను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తారు కూడా. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుప్రక్కన వదిలేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. కానీ మహబూబాబాద్ జిల్లా కె.సముద్రంలో మాత్రం సమాజం ఆశ్చర్యపోయేలా ఆడపిల్లకు సత్కారం జరిగింది. 
 
హైదరాబాద్‌కు చెందిన రమ్యకు, కె.సముద్రం పట్టణానికి చెందిన నవీన్‌తో మూడేళ్ళ క్రితం వివాహమైంది. రమ్యకు తొలి కాన్పులో పండంటి ఆడబిడ్డ పుట్టింది. మూడు నెలల తరువాత అత్తింటిగారికి వెళ్ళిన రమ్యకు అక్కడ ఊహించని విధంగా ఘనస్వాగతం లభించింది.
 
రావమ్మా మహాలక్ష్మీ అంటూ గులాబీ పూలపాన్పుపై ఆడబిడ్డను పడుకోబెట్టారు. బిడ్డతో సహా తల్లికి కూడా పూలవర్షంతో స్వాగతం పలికారు. ఇది చూసిన స్థానికులు కూడా ఆనందనం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు