కల్లు తాగడానికి బెంజ్ కార్లలో వస్తున్నారు, ఎందుకో తెలుసా? అంటూ చెప్పిన తెలంగాణ మంత్రి

సోమవారం, 31 ఆగస్టు 2020 (14:38 IST)
స్వచ్చమైన కల్లులో 15 రకాల రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నాయని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ విషయం శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో తేలిందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కల్లు కోసం బెంజ్ కార్లలో సైతం వస్తున్నారని తెలిపారు.
 
జనగామ జిల్లా మండెలగూడెంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కల్లులో కేన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు.
 
శివాజీ పరిపాలన సమయంలో సర్వాయి పాపన్న సామాజిక న్యాయం కోసం పోరాడారని, 400 ఏళ్ల క్రితమే ప్రజల్లో మార్పు కోసం ఆయన పోరాడారని కొనియాడిన ఆయన పాపన్న కోటలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బొమ్మకూరు రిజర్వాయర్లో వీరు చేప పిల్లలను వదిలారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు