లాక్‌డౌన్‌ను ఏం వాడుకుందిరా బాబూ..?

మంగళవారం, 23 జూన్ 2020 (14:03 IST)
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్‌ను హీరోయిన్ నిత్యామీనన్ అద్భుతంగా వాడుకుంటోంది. ఈ సమయంలో రెండు కథలను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడట. నిత్య కథ చెప్పిన తర్వాత నిర్మాత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ కథతో ఆమె సెట్స్ పైకి వెళుతుందని టాక్. అయితే లాక్ డౌన్ సమయంలో తను వెయిట్ తగ్గే పనిలో పడిందట. డైరక్షన్ ఓవైపు వెయిట్ లాస్ కోసం మరోవైపు నిత్యామీనన్ కసరత్తులు మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. 
 
ఇకపోతే నిత్యామీనన్ దర్శకత్వం వహించే మరో సినిమాలో ఆమే నటించడం కూడా చేస్తుందట. అంతటితో ఆగలేదు.. దర్శకత్వం చేస్తూ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించనుందట. ఇక ఆ సినిమాను పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందించే ఆలోచనలో ఉందని ఇండస్ట్రీ టాక్. 
 
అంతేగాక ఈ మూవీలో ఒక్కో భాషకి ఒక్కో హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి. నిత్య ఒక్కసారే అనేక బాధ్యతలు మోసేందుకు సిద్ధపడిందని సినీ పండితులు అంటున్నారు. ఈ బాధ్యతలను నిత్యమీనన్ సమర్థవంతంగా రాణిస్తుందో లేదో అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు