'మనిషివో... ఋషివో... రాజర్షివో...' ఎన్టీఆర్ బయోపిక్ సాంగ్ (Video)

బుధవారం, 12 డిశెంబరు 2018 (12:40 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 
 
'తల్లి ఏదీ.. తండ్రి ఏడీ? అడ్డు తగిలే బంధమేది? మనిషివో... ఋషివో... రాజర్షివో...' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికితోడు చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న పాటలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
 
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. తొలి సాంగ్ అద్భుతంగా ఉండగా, ఇపుడు విడుదల చేసిన రెండో సాంగ్ కూడా మరింత ఆకట్టుకునేలా వుంది. 
 
కాగా, ఈచిత్రంలో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, నందమూరి కల్యాణ్‌రామ్, రకుల్ ప్రీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర తొలి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు