నేను ఆత్మహత్య చేసుకోవాలా? జరిగింది చాలు.. ఇక ఆపండి: రియా చక్రవర్తి

గురువారం, 16 జులై 2020 (13:46 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి.. సుశాంత్‌ను తలచి భావోద్వేగ నోట్ రాసింది. ఈ నోట్ రాసిన రెండు రోజులకే.. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసేందుకు నెటిజన్లు మొదలెట్టారు. అంతేగాకుండా.. సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలు సుశాంత్ సింగ్ మృతికి  కారణమని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో హత్య, అత్యాచారం బెదిరింపులకు దిగారు. 
 
అత్యాచారం, హత్య చేస్తానని బెదిరించడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవాలని కూడా మన్నూ రౌత్ అనే మహిళ రియాను బెదిరించింది. రియాను ట్రోల్ చేస్తున్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై రియా చక్రవర్తి స్పందిస్తూ.. తనను ఎన్నో విధాలా ట్రోల్ చేశారు. అప్పడల్లా నిశ్శబ్ధంగా ఉండిపోయాను. నేను ఆత్మహత్య చేసుకోకపోతే మీరు నన్ను రేప్.. మర్డర్ అవుతారని బెదిరిస్తున్నారు. 
 
ఇలా నన్ను ఆత్మహత్య చేసుకో అని చెప్పే హక్కు మీకెవరిచ్చారు. ఈ కామెంట్లకు నా నిశ్శబ్ధం ఎలా సమాధానమిస్తుందని రియా ఫైర్ అయ్యింది. ఇంకా మన్నూ రౌత్ కామెంట్లపై రియా చక్రవర్తి మండిపడింది. మీ వ్యాఖ్యల తీవ్రతను గ్రహించారా? అంటూ ప్రశ్నించింది. చట్టం ప్రకారం ఇక ఇలాంటి వేధింపులకు గురికావొద్దు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇక జరిగింది చాలు.. ఆపండి అంటూ రియా ఫైర్ అయ్యింది. 
 
భారతదేశంలో మహిళల భద్రతను రియా ఎత్తిచూపుతూ, ద్వేషపూరిత సందేశాల వెనుక ఉన్న ఆన్‌లైన్ వినియోగదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. "ఇలాంటి అనుచిత వ్యాఖ్యలపట్ల @cyber_crime_helpline @cybercrimeindia చర్యలు తీసుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానని రియా ముగించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు