విజయ్ దేవరకొండను వాడేసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం

శుక్రవారం, 7 మే 2021 (22:41 IST)
vijay devarkonda
క‌రోనా సెకండ్ వేవ్ గురించి తెలంగాణ ప్ర‌భుత్వం ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేసింది. త‌గు జాగ్ర‌త్త‌లు చెబుతుంది. ఇంకోవైపు కోవిడ్ వేక్సిన్ రేప‌టినుంచి వేసేదిలేదు. నో స్టాక్ అంటూ చెబుతుంది. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాసుప‌త్రికి వెళ్ళాంటే భ‌య‌ప‌డుతున్నారు. నిన్న‌నే కోటి ఆసుప‌త్రిలో క‌నీసం వాట‌ర్ తాగేందుకు లేక‌పోతే అడ‌విశేష్ స్వంతంగా ఏర్పాటు చేశాడు. ఇక ప్ర‌భుత్వం ఏం చేయ‌డంలేద‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తుంటే నేటి రాత్రి విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న ఇప్పించింది. మీకు ఒల్లునొప్ప‌లు, ద‌గ్గు వుంటే క‌రోనా ల‌క్ష‌ణాలే అందుకే ద‌గ్గ‌ర‌లోని ఏదైనా ప్ర‌భుత్వ ఆసుపత్రికి వెళ్ళ‌డంటూ చెప్పించింది. ఆయ‌న ఏం చెప్పారో చూద్దాం.
 
ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. "కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి అధిగమించవచ్చు. మనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. మీకు దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా కరోనా అయి ఉంటది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి. కరోనా టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఏ లక్షణాలు కన్పించినా వెంటనే కరోనా నిబంధనలు పాటిస్తూ చికిత్స తీసుకొని. టైం అన్నిటికంటే ముఖ్యం. 
 
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హాస్పిటల్స్ లో, బస్తి దవాఖానాల్లో కోవిద్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టారు. మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా కొన్ని మందులను ఒక కిట్ రూపంలో ఇస్తారు. వాటిని వాడితే సరిపోతుంది. భయపడకండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు