యోగాసనాలు చేయడం వలన శరీరానికి...

సోమవారం, 18 జూన్ 2018 (11:03 IST)
మానవునికి శారీరక, మానసిక శక్తిని సమకూర్చేందుకు పలు రకాల సాధన ప్రక్రియలు ఉన్నాయి. అయితే వీటి పట్ల అవగాహన లేని ప్రారంభకులకు ఏ ప్రక్రియను ఎంచుకోవాలో తెలియక తికమకపడుతారు. ఫిట్‌నెస్, ఇంప్రూవ్‌మెంట్ తదితర కార్యక్రమాల్లో చేరి కోరుకున్నది ఒకటైతే పొందినది మరొకటి అన్న రీతిలో ఇబ్బందులు పాలవుతారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం సమతుల్యత పట్ల మనిషికి ఆసక్తి పెరుగుతున్న ఈ రోజుల్లో, అలాగే వృత్తి వ్యాపకాలలో పడి అనేక రకాల ఒత్తిళ్లకు గురవతున్న ప్రస్తుత నేపథ్యంలో యుగాల చరిత్ర కలిగిన యోగసాధన ఆధునిక మానవునికి ఎంతగానో ఉపకరిస్తుంది. యోగాకు శాస్త్రబద్ధత కలదు. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవనవిధానానికి యోగా సంజీవనిలా పనిచేస్తుంది.
 
యోగా సాధనతో మెదడు, దేహం ప్రవర్తన చైతన్యవంతమవుతాయి. మనిషిలోని అంతర్గత శక్తులను యోగా ఓ అద్భుత సాధనం. యోగాసాధనలో భాగమైన యోగాసనాలలో కొన్నింటిని ఆరోగ్య స్థితిగతులను అనుసరించి అభ్యసించవలసి ఉంటుంది. యోగాసాధనం చేయడం వలన అన్ని విధాలుగా శ్రేయస్కరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు