సందడి సందడిగా సాగుతున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. బంధువుల రాకతో కళకళలాడిన మండపంలో పెళ్లి జరిగిన గంట సేపటికే వరుడు మృతిచెందిన దురదృష్టకర సంఘటన కడప జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడులో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బీసీ కాలనీకి చెందిన సూర రామచంద్రారెడ్డి (24)కి కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో పెళ్లి జరిగిన అనంతరం నూతన దంపతులు వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు.
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ప్రొద్టుటూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వరుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. వరుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.