పసికందును నోట్లో కరచుకొని వీధిలోకి లాక్కొచ్చిన పందులు

శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల బట్టివాడలో దారుణం జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ పసికందును పందులు నోట్లో కరచుకొని వీధుల్లోకి లాక్కొచ్చాయి. ఈ విషాద ఘటన సంచలనం సృష్టించింది. 
 
అయితే, శిశువు అప్పటికే మృతి చెందిన విషయాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఘ‌ట‌న‌పై ఆందోళన వ్యక్తం చేశారు. వెంట‌నే స్థానిక‌ పోలీసులకు ఈ సమాచారాన్ని అంద‌జేశారు. ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి