విజయవాడ ఔటర్ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతి!

గురువారం, 23 అక్టోబరు 2014 (16:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాబోతున్న విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ భారీ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్టు ఆయన గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
వీజీటీఎం (విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) హుడా పరిధిలోని 180 కిలోమీటర్లలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సుమారు 20 వేల కోట్లను మంజూరు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని ఆయన వివరించారు. 
 
కేవలం భూసేకరణ కోసమే ప్రభుత్వం నాలుగు వేల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో విజయవాడ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబునాయుడు చొరవతోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఇంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేశినేని శివ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి